Pages

Monday, November 11, 2013

కొత్తపల్లి జయశంకర్‌





కొత్తపల్లి జయశంకర్‌


తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ (ఆగష్టు 6, 1934 - జూన్ 21, 2011) వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011, జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.
బెనారస్‌, అలీగఢ్‌ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్‌ ఓయూలో పీహెచ్‌డీ చేశాడు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ సీకేఎం ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు కేయూ రిజిస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశాడు.
అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమ్జన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేంది. విప్లవకవి వరవరరావు లాంటి వాళ్లు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమ్జన్సీ గడ్డురోజుల్లో ఆయన కళాశాలను నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుంచి కాపాడారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్సస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని పేరుపెట్టి పిలవడం ఒక్క జయశంకర్ సార్‌కే సాధ్యం అంటూ ఆయనకు తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రముఖ సాహీతివేత్త రామశాస్త్రి కన్నీళ్లపర్యంతమయ్యారు. జయశంకర్ విద్యార్థుల్లో అనేక మంది దేశవిదేశాల్లో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో కేయూ మాజీ ప్రొఫెసర్ ఎన్. లింగమూర్తి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ కే. సీతారామావు తదితరులు అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్.
1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1952 లో జయశంకర్ నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చాడు. కె.సి.ఆర్ కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించాడు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు. అబ్ తొ ఏక్ హీ ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ దేఖ్‌నా ఔర్ మర్‌జానా' (ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి) అని అనేవాడు.
విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుంచే తెలం‘గానం’ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనా టి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశా లాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సా ర్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన అపర మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణకోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయ నం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసిన అక్షరయావూతికుడు ఆయన.
తెలంగాణలోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద , విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణన్నినాదాన్ని వినింపించిన పోరాట శీలి.
తెలంగాణ సాధికారిక స్వరం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఇంటర్వ్యూ ప్రారంభసంచికలో వేయాలని ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ అల్లం నారాయణ సార్ ఆ బాధ్యతను నాపై పెట్టారు. జయశంకర్ సార్‌తో మాట్లాడటమంటే.. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమాన్ని గురించి తెలుసుకోవడమే. ఆ ఉత్సాహంతోనే సార్‌కు ఫోన్ల మీద ఫోన్లు చేసి విసిగించాను. ‘ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు. అయినా ఇప్పుడు నా ఇంటర్‌వ్య్యూ ఎందుకయ్యా చూద్దాం లే..’ అంటూ సున్నితంగా తిరస్కరించినప్పటికీ… చివరికి ఒప్పుకున్నారు.
హబ్సీగూడ రోడ్ నెంబర్ 5లో ఉన్న ‘కాంక్రీట్ హార్మొని’ అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్థులోని పెంట్‌హౌస్… అక్కడి నుంచి చూస్తే ఉద్యమాల పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ గొప్పగా కనిపిస్తోంది. అదేమాట సార్‌తో అంటే… ‘ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది చెప్పు.. అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తయి.. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్లముందే కదుల్తు కనిపిస్తరు. దు:ఖమొస్తది.. అయితే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు… అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్నాపకం. కానీ వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకుని… వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయనాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
మీరు చేయాల్సింది మీరు చేశారు. ఈ సమయంలో నేను ఇక్కడ ఇక ఉండలేను. నేను వరంగల్‌కే పోతాను. నన్ను పంపండి’ అంటూ ఆయన పుట్టిన గడ్డమీద మమకారంతో వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. ఇంట్లోనే వైద్యులు ఆయనకు అన్నిరకాల వైద్యసేవలు అందించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆయన పల్స్‌రేట్ పడిపోవడంతో ఆక్సిజన్ అందించారు.
మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం.. ఇదే జీవితం.. ఇందులోనే మరణం! ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు ప్రొఫెసర్ కొత్త పల్లి జయశంకర్ రెండేళ్లుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రొఫెసర్.. 21.6.2011 మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
మృత్యువు క్యాన్సర్ రూపంలో అతడ్ని దహించింది. కానీ సమైక్యాంధ్రలో బతుకు అతడ్ని అనుక్షణం రాచపుండై వేధించింది. జయశంకర్ ఓ సామాన్యమైన వ్యక్తి. సగటు తెలంగాణ బిడ్డ. కానీ మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగినాడంటే, మలి తెలంగాణ ఉద్యమానికి ముగ్గు పోసిన దీర్ఘదర్శి అయినాడంటే అది ఉట్టిగ జరగలేదు. అది ఎంతటి సంఘర్షణతో కూడుకున్నదో తన సన్నిహితులకు తెలుసు. ఇవ్వాళ నలుగురికీ తెలువాల్సిందీ ఒకటుంది. అది క్యాన్సర్ అని!
అవును. ఆయన క్యాన్సర్‌తో పోయిండు. తెలంగాణంలో మనం రాచపుండు అంటమే అది ఆయన్ని పట్టి పీడించింది, ఇవ్వాళా నిన్నకాదు. ఆ సంగతి చెప్పడానికి ముందు ఒక ఘట్టాన్ని చెప్పుకోవాల్సిందే. అది నిజాం స్టేట్. తనకు టీచర్‌గా అపాయింట్‌మెంట్ ఆర్డర్ చేతికందిన సందర్భం. అందరి లెక్కనే సంతోషంతో నలుగురికీ చెప్పుకున్నడు. మురిసిపోయిండు. తీరా ఉద్యోగంలో చేరేందుకు వెళ్లేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. సరేలే అనుకుని అట్లనే అపాయింట్‌మెంట్ ఆర్డర్ చేత పట్టుకుని జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళితే, తన స్కేల్ మారిందని తెలిసి విస్తుపోయిండు. నిజమే మరి. ఆంధ్రప్రదేశ్ అవతరణతో మన జీతాల్ని తగ్గించిండ్రు. ‘ఏంటిది?’ అని అడిగితే, ‘మిస్టర్ జయశంకర్. ఇది మీ నిజాం గవర్నమెంట్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మైండిట్..’ అన్నరట. దాంతో జయశంకర్ మరింత ఖంగుతిన్నడు.
ఇంకేమన్నరంటే, ‘ఇష్టముంటే చేయి లేకపోతే లేదని’ అమర్యాదగా చెప్పిండట. దాంతో ఆయన అహందెబ్బతింది. ఆత్మగౌరవం భంగపడ్డది. నిజానికి ఇంకా తాను అన్యాయం అని కూడా అనలే. కానీ వాళ్ల తీరు అట్ల ఉండింది. ఒక పురుగును చూసినట్టు చూసి, అతడ్ని హేళన చేసిండ్రు. అప్పుడు తన కళ్లు విచ్చుకున్నయి. ఇదేంది. మనని బతిమాలి బామాలి ఉమ్మడిగా ఉందాందామని ఒప్పించిన వాళ్లేనా వీళ్లు. మన గడ్డమీద మననే పరాయివాళ్లుగా ట్రీట్ చేయడం ఏమిటీ అని జయశంకర్ విస్తుపోయిండు. వాళ్ల జీతాలతో సమానంగా మన జీతాలు తగ్గించినందుకు సంజాయిషీ ఇవ్వవలసింది పోయి తలబిరుసుతో ’ ఉద్యోగం చేస్తే చేయి… లేకపోతే లేదు’ అని అనడం యువకుడైన జయశంకర్‌ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టయింది. తెలంగాణ బిడ్డగా మొట్టమొదటి సారిగా జయశంకర్ సార్ తీవ్రంగా హర్ట్ అయ్యింది ఇక్కడే. ఇక, అదీ మొదలు, ఆయన ఎన్నో చూసిండు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ వల్ల తెలంగాణ బిడ్డలు ఇంకెన్ని విధాలు మోసపోతరో ఆ రోజే తనకు అర్థమైంది. ప్రశ్నిస్తే మననెట్లా హేళన చేస్తరో, దెబ్బలు తీస్తరో ఆరోజే ఆయనకు తేటతెల్లమయింది. ఒక్కమాటలో ‘ఆంధ్రపదేశ్ అవతరణ’ తెలంగాణ పాలిట రాచపుండు అన్న సంగతి ఆయనకు ఆనాడే సుస్పష్టమైంది. ఇవ్వాళ ఆయన క్యాన్సర్‌తో మరణించిండంటే అది చిన్న విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయాలు, అణచివేతలు, లాఠీలు, తూటాలు, చివరకు నిన్నమొన్నటి పిల్లలు తన ముందే పిట్టల్లా రాలిపడుతుంటే, ఇంతటి సంక్షోభాన్ని చూస్తూ చూస్తూ ఆయన ఇంతకాలం బతికిండంటే అది ఓ నరకయాతన.
నిన్నమొన్న వచ్చిన క్యాన్సర్ తన శరీరాన్ని దహించివుండవచ్చుగాక, కానీ నాటినుంచే తన మనసును సలసల మరిగించిన కోస్తాంధ్రుల అనైతిక పరిపాలన అతడ్ని తీవ్రంగా కృంగదీసింది. ఆ పరితాపం, నిస్సహాయతనుంచే ఆయన ఒక అనివార్యమైన కలగన్నాడు. అదే ‘ప్రత్యేక తెలంగాణ’ . ఇందుకోసమే ఆయన ‘సిద్ధాంతకర్త’గా’ తన మేధస్సుకు పదును పెట్టుకోవాల్సి వచ్చింది. సమకాలీన రాజకీయాలను ఔపోసాన పట్టేలా, ‘భౌగోళిక తెలంగాణ’కు మద్దతుగా నిలబడేలా చేసింది. తెలంగాణ ఏర్పాటు వైపు అన్ని రాజకీయపార్టీలూ ఐక్యంగా కదిలేందుకు అహర్నిశలూ శ్రమించేలాచేసింది. స్వయంగా ఉద్యమకారుడూ కావాల్సి వచ్చింది. కాళోజి ‘నా గొడవ’ ను ‘తెలంగాణ గొడవ’ గా మలిచేలా చేసింది. ‘తెలంగాణ రాష్ర్టం- ఒక డిమాండ్’ అన్న పుస్తకమే తన బతుకు పుస్తకంగా మారేలా చేసింది. నిజానికి సార్ చాలా మామూలుగా మనిషి. ఎటువంటి వ్యధాభరిత ప్రయాణం లేకుండా హాయిగా, నిమ్మలంగా బతకాల్సిన ఓ మామూలు మనిషి. కానీ, ఇయ్యాళ తనకోసం యావత్ తెలంగాణ కన్నీరుకార్చే మనిషయ్యిండంటే -అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ లేదా 1 నవంబర్ 1956. అదే తెలంగాణను పట్టిపీడిస్తున్న రాచపుండు. లాస్టుల ఒకటే మాట. ఆయన మనను వీడిపోయినందుకు మనం బాధపడితే తన ఆత్మ శాంతించదు ఈ పీడ వదిలితేనే ఆయనకు మనశ్శాంతి.

బత్తిని మొగిలయ్య గౌడ్




బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ వాసుల్లో ‘బత్తిని మొగిలయ్య గౌడ్’ గురించి తెలియని వాళ్లు ఉండరు. రజాకార్లతో పోరాడి అమరుడైన వీరుడు మొగిలయ్య. ఆయన భార్యే లచ్చవ్వ. డబ్బుకు ఆరాటపడని ఆ తెలంగాణ తల్లి తన భర్త వేన వేల జ్ఞాపకాలను మదిలో దాచుకున్న తీరు చదవండి...

‘‘..చిన్నప్పుడే నాకు మొగిలయ్యతో పెండ్లైంది. ఆయన చానా పొడుగరి. అందరితో
మంచిగా సోపతి జేసేటోడు. రోజు బండరాళ్లను పైకి కిందికి ఎత్తుతూ, కత్తులను, కర్రలను ఇటు అటు తిప్పుతూ సాధన జేసేటోడు. ఆయన గుర్తుగా ఇప్పటికి అవి నేనున్న మా కోట ఇంట్లనే ఉన్నయి. ఆ రోజు ఆదివారం (11--1946). నేను పదిహేనొద్దుల బాలింతను. గారోజు పొద్దుగాల్నే మొగిలయ్య వరిమండెకు నీళ్లు బోసి వత్తనని పోయిండు. అప్పుడే వాళ్ళమీద మన్నుబడ రజాకార్లు వచ్చిండ్లు. మా ఇంటి ముంగట లొల్లిబెట్టుకుంట రాళ్లతో గొట్టుకుంట ఆగమాగం జెయ్యబట్టిండ్లు. ఎట్ల దెలిసిందో ఏందోగని ఆయన పొలం కాడికని పోయినోడు ఉరికచ్చి మా ఇంట్ల, గడ్డి గుడిసె సూరులో దాసిన జంబియా దీసి బయటకురికి రజాకార్ల మీద పడ్డడు. ఇంట్ల ఉన్న నాకు, మా అత్తకు ఏం జరుగుతాందో తెల్వలే. అటెంక కొద్దిసేపట్లనే ఒర్రుడు, తుపాకి దెబ్బలు ఇన్పడ్డయి. వాళ్ళమీద మన్నుబడ ఆయనను సంపనే సంపిండ్లు.

తమ్మున్ని సంపుతాంటే అడ్డంబోయిన మా బావకు సుత కత్తి దెబ్బల్ దాకినయ్, అటెంక అందరు నా మంచం సుట్టూత జేరిండ్రు. గుండెలు అవిశిపోయేటట్టుగ ఏడ్చిన. అటెంక ఎవలు మందలిచ్చెటోల్లే లేకుంట అయింది. మొగిలయ్యతో కలిసి తిరిగినోళ్లు, లీడర్లు, దేశ దేశాలల్ల మొగిలయ్య పేరు మీద పైసలు వసూలు జేసిండ్లు, వసూలు చేసిన పైసలు అందరి ముంగట ఇచ్చెటోల్లు..తెల్లారే మల్ల తీసుకపోయేటొల్లు. ఒక్కపైస నా చేతికి రాలే.’’

-లచ్చవ్వ ఇప్పుడు కూడా అప్పుడు మొగిలయ్యతో కలిసి కాపురం చేసిన ఇంట్లోనే ఉంటున్నది. తనను ఎవ్వరు గుర్తించకున్నా, గౌరవించకున్నా మొగిలయ్యతో పంచుకున్న జ్ఞాపకాలు ఇంకా తన మనసులో సజీవంగా ఉన్నట్టు చెప్పింది. మంత్రి పొన్నాల లక్ష్మయ్య లచ్చవ్వను సన్మానించి వెయ్యినూట పదహార్ల రూపాయలివ్వబోతే. ‘వెయ్యి నూట పదహార్లు, వద్దు వేల జ్ఞాపకాలు సాలు’ అని, ఆ సన్మానాన్ని, డబ్బుని తిరస్కరించింది.

అదీ ఆమె ఆత్మగౌరవం. అట్ల డబ్బుకు ఆరాటపడని ఆ తెలంగాణ తల్లికి వందనాలు.
(‘చరిత్ర మరవని ఓరుగల్లు ఉద్యమ కెరటం-బత్తిని మొగిలయ్య గౌడ్’

కాళోజీ నారాయణరావు








కాళోజీ నారాయణరావు



తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు 1914, సెప్టెంబరు 9 న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.
ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ హైస్కూలు లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. 1939 లో హైదరాబాదు లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది.1940 లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది.
మాడపాటి హనుమంతరావు , సురవరం ప్రతాపరెడ్డి , జమలాపురం కేశవరావు , బూర్గుల రామకృష్ణారావు , పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూరు విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు

కొమురం భీమ్




కొమురం భీమ్

కొమురం భీమ్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు.కొమురం భీమ్ గిగిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్ సోంబాయి దంపతులకు 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామం లో జన్మించాడుభీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి కావడంతో అప్పటి నుండి ఆ తిధి రోజునే ఆదివాసీలు కొమురం భీమ్ వర్ధంతిని జరుపుకొంటూ వస్తున్నారుఆ దివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీం. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం.పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు.ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటి కి డ్బ్భై రెండు ఏళ్లు పూర్తి కావస్తున్నది. ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీం వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. స్వయంపాలన కోసం తెలంగాణ ప్రజలు అలుపు ఎరగకుండా ఉద్యమిస్తున్న సందర్భం నేడున్నది. స్వయంపాలన కోసం ఉద్యమిస్తున్న ఆదివాసీ సమాజాలను క్రూరంగా అణచివేస్తున్న ప్రభుత్వాలు కండ్లముందు కనబడుతున్నాయి. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్బాలు అనేకంఉన్నాయి. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సాముండా, సంతాల్‌లు,తిరుగుబాటు చేశారు. జల్, జంగల్, జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్నిరకాల దోపిడీ, పీడనలను ఎదిరించారు. చరివూతలో అనేకసార్లు ఓటమి చెందినా తమ జీవితమే యుద్ధమై న చోట తమ అస్తిత్వం కోసంఅలుపెరుగని పోరాటాలు నేటికీ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు ఎప్పటికీ ఒక రాజ్య భావనలో ఇమిడిలేరు. వారు స్వేచ్ఛా ప్రియులు. వారి జీవనాధారమైన అడివినుంచి వారిని తరిమేసే విధానాలు, చట్టాలతో వారు తలపడ్డారు. ఆదివాసీ ఆవాసాల్లోకి గిరిజనేతర భూస్వాముల వలస నిరాటంకంగా సాగింది. పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పంటవేస్తే అది జంగ్లాత్ భూమి అని ఒకరు, కాదు రెవెన్యూ భూమి అని మరొకరు వచ్చి గోండులను వారి భూముల నుంచి తరిమేశారు. పంటలను ధ్వంసం చేశారు. జరిమానాలతో వేధించారు. ఈవేధింపులు, అణచివేతల నేపథ్యంలోంచే..ఆదిలాబాద్ గోండన్నలు పోరుబాట పట్టారు.తమ విముక్తి కోసం పోరాట జెండాపట్టారు. ‘మాఊర్లో మా రాజ్యం’అంటూ పన్నెండు గూడాలు బాబేఝరి లొద్దుల్లో తుడుం మోగించాయి. కొమురంభీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై తమపై జులుం చేస్తున్న దోపిడీవర్గాలపై తుడుం మోగించారు. కొమురంభీం పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించే లోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది. భీంతో సహా పన్నెండు మంది ఆదివాసీ వీరులు అమరులయ్యారు. నిజాం సర్కారు పాశవికంగా కొమరంభీం పోరాటాన్ని అణచివేసింది. భీం అమరత్వం జోడేఘాట్ లొద్దుల్లో నేటికీ ప్రతిధ్వనిస్తున్నది. ఏహక్కుల కోసమైతే..నాడు భీం ఉద్యమించాడో.. ఆ హక్కుల కోసం ఆదివాసులు నేటికీ నిరంతరం పోరాటం చేయవలసే వస్తున్నది. ప్రజాస్వామిక రాజ్యమని చెప్పుకుంటున్న నేడు కూడా..ఆదివాసుల అవస్థలు ఏమీ తీరలేదు. నిజాం రాజు నియమించిన హైమన్‌డార్ఫ్ సూచనలను కూడా నేటి పాలకులు పాటించడంలేదు. కానీ నాటి నిజాం ప్రభువయినా.. గిరిజనుల అభ్యున్నతి కోసం హైమన్‌డార్ఫ్ సూచనలను పాటించాడు. వారి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాడు. కానీ..నేటి పాలకులు ఇవేవీ పట్టకుండా ఆదివాసులపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. కొమురం భీం స్ఫూర్తితో విప్లవ సంఘాల నాయకత్వంలో మరొకసారి ఆదివాసులు సంఘటిత పోరాటాలు చేశారు. దీంతో.. ఆదివాసుల ఐక్యతను చూసి తట్టుకోలేని ప్రభుత్వం ఇంద్ర మారణకాండను సృష్టించింది. ఇది ఆధునిక కాలంలోని మరో జలియన్‌వాలా బాగ్‌గా ప్రజాస్వామికవాదులు పిలుస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆదివాసుల పోరాటానికి సంఘీభావం వచ్చింది. ప్రభుత్వ దమననీతిని ఖండించారు. రాజ్యం తన హేయమైన చర్యలు చేస్తూ నే.. మరోవైపు సంస్కరణలు చేపట్టింది. ఆదివాసుల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా..పైపూత మాటలతో జోకొట్టే ప్రయత్నం చేసింది. ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక రక్షణ ఇచ్చే రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూలును తుంగలో తొక్కి ఆదివాసులపై అన్నివైపుల నుంచి దాడులు జరుగుతున్నా యి. ప్రాజెక్టులు, గనుల తవ్వకాల పేరుతో నిర్వాసితులను చేస్తున్నది. ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 చట్టాన్ని అమలు పర్చడంలేదు. అన్యాక్షికాంతమవుతున్న అడవులను, భూములను పట్టించుకోదు. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నె,కోయ తెగలే కాకుండా నాయక్‌పోడ్, ఆంధ్ ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్‌లో నివసిస్తున్నాయి. ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1975కు పూర్వం వలస బంజారాల జనాభా కేవలం పది వేలనని హైమన్‌డార్ఫ్ స్పష్టం చేశారు. ఇప్పుడు వీరి జనాభా పదింతలపైన ఉన్నది. వలస వచ్చిన వాళ్ళు ప్రజావూపతినిధులవడంతో వీరికష్టాలు రెట్టింపయ్యాయి. ఆదిమ సమా జం వీరి వల్ల రక్షణలను కోల్పోతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఆదివాసీల మనుగడ కష్టమేనని ఆదివాసీ నాయకులు మదనపడుతున్నారు. ఆదివాసీల రక్షణ ప్రభుత్వానిదే అయినప్పుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావడంలేదు. ఏటా విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోతున్నా, ఆదివాసులకు కనీస వైద్య సౌకర్యాలు అందడంలేదు. ప్రతిఏటా రెండు వందల నుంచి మూడు వందల మలేరియా మరణాలు సంభవిస్తున్నాయి. పోషకాహారలేమితో మరణిస్తున్న పిల్లల సంగతి లెక్కేలేదు. భీం పోరాటం చేసిన ప్రాంతంలో (జోడేఘాట్) నేటికి తాగడానికి నీళ్ళులేవు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ సమాజాల జీవన ప్రమాణా లు క్షీణిస్తున్నాయి. భీం పోరాటం జరిగి డెభ్బైఏళ్లు అవుతున్నా, ఆపోరాట స్ఫూర్తినేటికీ ఉన్నది. అది మరోఇంద్ర పోరాట రూపం గా పెల్లుబకవచ్చు. ప్రభుత్వాలు మరో ఉప్పెన రాక మునుపే మేల్కొనాలి. అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేటి తరుణంలో, 1940లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన పునాదులుగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు. అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నది. బాబేఝురి లొద్దుల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ దండకారణ్యంలో కొనసాగుతున్నది.జల్,జంగల్,జమీన్ కోసం ఆదివాసులు కొమురంభీం బాటలో పయనిస్తున్నారు. కొమురం భీంను ప్రేమించే వాళ్లుగా.. ఆదివాసుల అస్తిత్వ పోరాటాలకు అండగా నిలుద్దాం. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రజలు అస్తి త్వంకోసం,స్వయంపాలన కోసం పోరాడుతున్నారు. సందర్భాలు వేరు కావచ్చు. కాని పోరాట లక్ష్యాలు ఒకటే. తెలంగాణ ప్రజలు కొమురం భీం పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పరపీడన నుంచి విముక్తి కోసం ఆయుధమెత్తి పోరాడిన భీం వారసులుగా కదం తొక్కాలి. వలస పాలనను అంతం చేయాలి. అదే.. కొమురం భీంకు నిజమైన నివాళి. నిజాం పాలకుల నిరంకుశత్వానికి.. అధికారుల దమన నీతికి ఎదురు నిలిచి పోరాడిన కొమురం భీం ఆశించిన లక్ష్యాలను నేటి పాలకులు నెరవేర్చలేక పోతున్నారు. భీం మరణించి 72 ఏళ్లు గడుస్తున్నా జల్, జంగిల్, జమీన్‌పై ఆదివాసీలు నేటికీ హక్కులు పొందలేకపోతున్నారు. నాటి నుంచి నేటి వరకు గిరిజనులు హక్కుల కోసం పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. భీం పుట్టింది ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం సంకెపల్లి.. పెరిగింది సుర్తాపూర్. కష్టపడి అడవి నరికి పోడు వ్యవసాయం చేసేవాళ్లు. రాత్రింబవళ్లు కావలి కాసి పంటలు పండించేవాళ్లు. గిరిజనులపై నిజాం సర్కారు పెత్తనం చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు పంటను కొట్టిన కల్లంలోనే.. కైలు కింద గింజలు ప్రభుత్వానికి అప్పజెప్పేవారు. గిరిజనులు పోడు చేసుకునే భూములకు పట్టాదారులుగా ఇతరులు ఉండేవారు. గిరిజనులు ఎంతటి దట్టమైన అడవిలో భూములను సాగుచేకున్నప్పటికీ వాటిపై తమకే పట్టాలు ఉన్నాయని సర్కారోళ్లు.. జంగ్లాత్ వాళ్లు గొడవలు చేసేవాళ్లు. తిరిగబడ్డ గిరిజనులపై కేసులు పెట్టేవాళ్లు. ఇలాంటి సంఘటనలే కొమురం భీంను కదిలించాయి. ఇలా పంట వసూలు కోసం తమ చేనులోకి వచ్చి కూర్చున్న సిద్ధికి అనే వ్యక్తిని కర్రతో తల పగలకొట్టాడు భీం. ఈ దెబ్బతో సిద్ధికి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో భయపడ్డ భీం మహారాష్ట్రలోని బల్లార్షా, చందా దిక్కు పారిపోయాడు. అక్కడ తేయాకు తోటల్లో కూలీపని చేసుకుంటూ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. మరాఠీ, ఉర్దూ భాషలు నేర్చుకున్నాడు. కొత్త కొత్త పంటలు పండించటం, వాటిని మార్కెట్‌లో మంచి ధరకు అమ్మటం తెలుసుకున్నాడు. తరువాత భీం తల్లిదంవూడులు ఉంటున్న కాకన్‌ఘాట్‌కు వచ్చాడు. ఆ గ్రామంలోని గిరిజనుడు లచ్చుప వద్ద జీతం ఉండగా భీంకు సోంబాయితో పెళ్లి జరిగింది. ఆ కాలంలో అరకకు ఐదు రూపాయలు, పోడుకు రెండు రూపాయల చొప్పున పన్నును ఆసిఫాబాద్ తహసిల్దార్‌కు కట్టేవారు. కొమురం భీం అప్పటి తహసిల్దార్‌తో మాట్లాడి లచ్చుప చెందిన పన్నెండు ఎకరాల భూమి కేసును కొట్టేయించాడు. అప్పటినుంచి ఆ ప్రాంత గిరిజనులందరికీ భీం నాయకుడయ్యాడు. 60 ఎకరాల అడవిని నరికి 12 గ్రామాలను ఏర్పరిచాడు. ఆ గ్రామాలు జోడుణ్‌ఘాట్, పట్నాపూర్, బాబెఝరి, నర్సపూర్, కల్లెగాం, చాల్‌బడి, బోయికన్ మోవాడ్, భోమన్‌గొంది, భీమన్‌గొంది, అంకుసాపూర్, దేవునిగూడ, గొగినవమోవాడ్. దీంతో అటవీ అధికారులు భీం మీద కేసుపెట్టారు. ఓ చౌకిదార్, అమీన్, తొమ్మిది మంది పోలీసులు వచ్చి భీం ఇంటిని సోదా చేయగా ఏమీ దొరకలేదు. దీంతో భీంకు కోపం వచ్చి వాళ్లపై తిరుగబడి కొట్టాడు. దీంతో అధికారులు భీంపై కేసుపెట్టారు. గిరిజనులు పోడుచేసుకుంటున్న భూములకు పన్ను కట్టాల్సిన పనిలేదని కోర్టు తీర్పు ఇచ్చిప్పటికీ అధికారుల వేధింపులు తప్పలేదు. భీంను, ఆయన అనుచరులను ఎదుర్కొనేందుకు 1940 సెప్టెంబర్ 1న నైజాం పోలీసులు వచ్చి 300 మంది గిరిజనులు ఉన్న 12 గ్రామాలను చుట్టిముట్టారు. మొదట భూములకు పట్టాలు ఇస్తామని చెప్పటంతో గిరిజనులు ఇళ్లల్లోంచి బయటకు వచ్చా రు. వీరిని పోలీసులు కొట్టడంతో గొడవ జరిగి కొమురం భీంతోపాటు 11 మంది గిరిజనులు చనిపోయారు. భీం నాయకత్వంలో గిరిజనులు పోలీసులకు ఎదురు నిలిచిన సంఘటన నిజాం ప్రభువును కదిలించింది. వారి సమస్యల పరిష్కారానికి, సదుపాయాల కల్పనకు, వారి జీవన విధానంపై పరిశోధన చేసి నివేదిక సమర్పించటానికి ఇంగ్లాండ్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ హేమన్‌డార్ఫ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన గిరిజనులతో కలిసిపోయి వారి జీవన విధానాలను అధ్యయనం చేసి గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సిన పథకాలను సూచిస్తూ నివేదిక తయారు చేసి నిజాం సర్కారుకు అందజేశారు. నేడు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి నాటి భీం త్యాగఫలితమే.. కొము రం భీం వారసులు ప్రస్తుతం సిర్పూర్(యు) మండలం పెద్దదోబలో ఉంటున్నారు. భీం మనుమడు కొమురం సోనేరావ్ ప్రభుత్వం నిర్వహించే వర్ధంతి సభలో పాల్గొంటున్నారు. భీం నేలకొరిగిన జోడెఘాట్‌లో కొమురం భీం మునిమనవరాలు కొమురం భీంబాయి నివసిస్తున్నారు. జోడేఘాట్ ఏర్పాట్లు ఏటా అశ్వయుజ కార్తీక పౌర్ణమి రోజు కెరమెరి మండలం జోడేఘాట్‌లో కొమురం భీం వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు ఆయన 72వ వర్ధంతి దర్బార్‌ను సోమవారం జోడేఘాట్‌లో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హట్టిలోని భీం స్మారక బేస్‌క్యాంప్‌ను రంగులతో అలంకరించి, భీం విగ్రహాన్ని ముస్తాబు చేశారు. హట్టి గ్రామం వద్ద స్వాగత తోరణానికి రంగులు వేయించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జోడేఘాట్‌లోని భీం విగ్రహానికి రంగు లు వేయించి, సమాధిని పూలతో అలంకరించారు. వర్ధంతి సందర్భంగా 15 వేల మందికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. భీం వర్ధంతి సభకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ప్రజాగాయకుడు గద్దర్ రానున్నారని కొమురం భీం యువసేన జిల్లా అధ్యక్షుడు పేందూర్ ప్రభాకర్ తెలిపారు. ‘నిజాం సర్కారే నయం’ ‘కొమురం భీం పోరాడి పొందించిన 12 గ్రామాలను భీంనే ఏలుకొమ్మని నిజాం అనుమతినిచ్చాడు. కానీ ఆదివాసీలందరికీ హక్కులు కావాలని పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంతో నిజాం సర్కారు భీంను చంపేసింది. కానీ ఇప్పుడు సర్కారు ఆదివాసీల కనీసం హక్కులను కూడా హరిస్తోంది. కనీసం తాగేందుకు నీళ్లుకూడా లేకుండా చేస్తోంది. ఈ సర్కారు కన్నా నిజాం సర్కారే నయం. నా భర్త పొందించిన 12 గ్రామాలను ఏలుకొమ్మని అధికారం ఇచ్చాడు’ ఇవి భీం భార్య సోంబాయి బతికున్నప్పుడు అన్న మాటలు. అవును నిజమే నిజాం సర్కారు కేవలం భూములపై, పంటలపై, అడవిపై మాత్రమే ఆంక్షలు విధించి వీటిని చెల్లించాలని ఆదివాసీలపై పెత్తనం చెలాయించేది. కానీ ఇప్పుడున్న సర్కారు ఆదివాసీల కనీస హక్కులను సైతం హరిస్తోంది. 72 ఏళ్ల క్రితం జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడి ప్రాణాలను వదిలిన కొమురం భీం ఆశయాలను ఇంత వరకు మన పాలకులు, అధికారులు నెరవేర్చలేక పోతున్నారు. అటవీ చట్టాల పేరుతో అడవుల్లో ఆదివాసీలను మైదానాలకు తరిమి వేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. ఆదివాసీల సమస్యలు ఎప్పటికీ తీరవనే ముందు చూపుతోనే ప్రస్తుత సర్కారు కన్నా నిజాం సర్కారే నయమని సోంబాయి అనుకొని ఉంటారు..

వీరవనిత చాకలి ఐలమ్మ


వీరవనిత చాకలి ఐలమ్మ



వీరవనిత చాకలి ఐలమ్మ


 పేరుమోసిన దొరోడి గడికి కాలినడకన వెళ్లి ‘చాకలి అంటే అరత అలుసా..’ అని ప్రశ్నించింది. తెగిస్తే.. అదే ప్రశ్నిస్తే.. ప్రతి మహిళా రాణిరుద్రమా అవుతుందని నిరూపించింది. ఇంత తెగువ ఎక్కడి నుండి వచ్చింది. ఇంతకి ఆమె ఎవ్వరూ? ఆమే ధీరవనిత చాకలి ఐలమ్మ. ఇప్పుడు అందరూ ఆమెమాటే ఎత్తుతున్నారు. ఆమెలా ఉద్యమించాలని ఢిల్లీ నుండి గల్లీ వరకూ నాయకులు పిలుపునిస్తున్నారు.

ఐలమ్మ పుట్టినిల్లు వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామం. ఆ పక్కనే ఉన్న పాలకుర్తి మండల కేంద్రంలో ఆ వీరవనిత మెట్టినిల్లు. చాకలి ఐలమ్మ పుట్టి పెరిగింది పేదింట్లో. కష్టాలు తెలుసు. కన్నీళ్లూ తెలుసు. దొరోడు భూమి లాక్కుంటుంటే విడిచి పెట్టలే. ఈ భూమి నాది అంటూ తిరుగుబాటు చేసింది. తెలంగాణా రైతాంగ సాయుధ పోరులో అరుణతారలా మెరిసింది. ప్రజా పోరాటాలకు ఆదర్శప్రాయురాలైంది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. ప్రధానంగా కులవృత్తే జీవనాధారం. మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. అందులో నాలుగు ఎకరాలు సాగుచేశారు. పాలకుర్తి పట్వారీ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. ప్రజలు వెట్టికి గురై స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు కల్పించబడ్డాయి. దొరలచే పీడించబడిన జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు. పాలకుర్తి పట్వారీ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో ఆంధ్ర మహాసభ నింపిన చైతన్య స్ఫూర్తితో పనిచేయడానికి నిరాకరించింది. ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్న భూస్వాములు కుట్రలను తిప్పికొట్టింది. విసునూరు దేశ్‌ముఖ్‌ రాపాక రాంచంద్రారెడ్డికి ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని, వారికి ఆశ్రయం కల్పిస్తుందని పాలకుర్తి పట్వారీ ఫిర్యాదు చేశారు. రాంచంద్రారెడ్డికి ప్రతి గ్రామంలోనూ ఏజెంట్లు ఉన్నారు. అందులో ఒకరు వీరమనేని శేషగిరిరావు. విసునూరు దొర అండతో గ్రామాల్లో ఏజెంట్లు, వారి అనుచరులు ప్రజల్ని చిత్రహింసలు పెట్టారు. ఐలమ్మను దెబ్బకొట్టాలని వేచిచూసిన దొరకు పాలకుర్తి జాతర కలిసివచ్చింది. ఆ జాతరలోనే ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వేలాది మంది పాల్గొనే జాతరలో తనమాటను ఖాతరు చేయలేరని దేశ్‌ముఖ్‌ పోలీసులను ఉపయోగించుకున్నాడు. గుండాలను, అనుచరులను పాలకుర్తికి పంపాడు. రద్దీగా ఉన్న జనంలోకి దేశ్‌ముఖ్‌ గుండాలు చేరారు. సభను భగం చేసేందుకు ఘర్షణ సృష్టించారు. అంతకు ముందురోజు నాయకులను హత్య చేస్తామని హెచ్చరించారు. గొడవతో సభ నిలిపివేశారు. కారణాలు వివరించేందుకు నాయకులు సమావేశమయ్యారు. అటుగా వచ్చిన గుండాలు దాడిచేసే ప్రయత్నంలోనే స్థానిక నాయకుడు జీడి సోమనర్సయ్య, కార్యకర్తలు దొర అనుచరుడైన ఓనమాన వెంకయ్యను చితకబాదారు. వాలంటీర్లు అప్రమత్తంగా ఉండటంతో గుండాలు పారిపోయారు. తన అనుచరుడిని దేహశుద్ధి చేయడాన్ని జీర్ణించుకోలేని దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డి తనను హత్యచేసేందుకు కుట్ర పన్నారని, అనుచరులపైన దాడికి పాల్పడ్డారని అక్రమ కేసులు పెట్టించారు. ఆ కేసులో అగ్రనాయకులతో పాటు ఐలమ్మ కుమారులు చిట్యాల సోమయ్య, చిట్యాల లచ్చయ్య, భర్త నర్సయ్యలను ఇరికించారు. అయినప్పటికీ కోర్పులో తీర్పు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఐలమ్మను ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టుకోల్పోతుందని భావించిన దేశ్‌ముఖ్‌ మల్లంపల్లి భూస్వామిని పిలిపించుకున్నాడు. పాలకుర్తిలో ఐలమ్మ సాగుచేస్తున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు. ఐలమ్మ సాగుచేసిన భూమి తనదని, పండించిన పంట తనకే దక్కుతుందని పంటను కోసుకరమ్మని వందమంది అనుచరులను పాలకుర్తికి పంపాడు. ఈ విషయాలపై అప్పటికే చర్చించిన కమ్యూనిస్టు నాయకత్వం యువ కిశోరాలను రంగంలోని దించింది. ఆరుట్ల రాంచంద్రారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, నిర్మల కృష్ణమూర్తి తదితర నాయకత్వం పాలకుర్తిలో సమావేశం జరిపింది. కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసింది. ఈ సంఘటన నాటికి ఐలమ్మ భర్త, కుమారులు జైల్లోనే ఉన్నారు. జీడి సోమయ్య, వీరమనేని రాంచంద్రయ్య, కమ్మరి బ్రహ్మయ్య, మామిండ్ల కొరరయ్య, ఐలయ్య, జీడి బాలయ్య, చుక్కా సోమయ్య, ఆంధ్ర మహాసభ కార్యకర్తలు, బయటి గ్రామాల నుండి వచ్చిన నాయకులు ఐలమ్మతో సహా పొలం దగ్గర కూర్చున్నారు. పంటను కోసి ఎత్తుకెల్దామని వచ్చిన దొర గుండాలను ఎదిరించారు. ‘ఆంధ్రమహాసభకు జై, దేశ్‌ముఖ్‌ దౌర్జన్యాలు నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. తాను బతికి ఉన్నంత కాలం భూమి, పంట మీకు దక్కదని ఆవేశపూరితంగా ఐలమ్మ కొంగునడుంకు బిగించి చుట్టి సంఘం అండతో ఎదురించడంతో దేశ్‌ముఖ్‌ గుండాలు పలాయనం చిత్తగించారు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోసారు. భంగపాటుకు గురైన దేశ్‌ముఖ్‌లు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తమ పంటను కమ్యూనిస్టులు దోచుకెళ్లారని నాయకులపై, స్థానికులపై కేసులు పెట్టించాడు. నాయకులను, కార్యకర్తలను అనేక రూపాల్లో చిత్రహింసలు పెడుతున్న పోలీసులను చూసి దేశ్‌ముఖ్‌ ఆనందపడిపోయాడు. కోర్టులో గెలిచేందుకు దేశ్‌ముఖ్‌ వేసిన పాచికలు పారలేదు. కమ్యూనిస్టు నాయకత్వం చొరవ, కొండా లక్ష్మణ్‌ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్‌ముఖ్‌ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. కోపోద్రిక్తుడై పాలకుర్తిపై దాడులు నిర్వహించి ఇండ్లను తగులబెట్టించాడు. ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టారు. ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. పాలకుర్తిలో ఐదుగురిని అకారణంగా హత్యచేయించాడు దేశ్‌ముఖ్‌. అనేక రకాలుగా నష్టపోయిన ఐలమ్మ కుటుంబం ఎర్రజెండాను వీడలేదు. ఐలమ్మ కుమారులు ముగ్గురు దళకమాండర్లుగా పనిచేశారు. పాలకుర్తి పట్వారీ ఇంటిని కూల్చి అదే స్ధలంలో మొక్కజొన్న పంటను పండించిన ఘనత మరువలేనిది. ఐలమ్మ భూపోరాటం తెలంగాణా సాయుధ పోరుకు తోడ్పాటునందించింది

Sunday, June 16, 2013



        ENGLISH  

 తెలుగులో 
        LINKS(లింక్స్)
1




AGRICULTURE



వ్యవసాయం గురించి 
                                               
2
ADVICE TO PARENS
 పిల్లల సంక్షేమం గురించి 
www.safekids.com



3



AIRLINES









 విమాన సర్వీసుల గురించి  




        OTHER SERVICES

4


ANDRAPRADESH


       ఆంధ్రప్రదేశ్  
5
APPLICATIONS

6
ARMY

7



AUTO MOBILS


ఆటోమొబైల్స్ గురించి 
8
AWARDS
 అవార్డ్స్ గురించి 
9

AYURVEDA

 ఆయుర్వేదం గురించి 

10
Dr.Br.AMBEDKAR