Pages

Saturday, June 8, 2013

వినాయక చవితి


వినాయక చవితి

            భారతీయుల తొలి పండుగ వినాయక చవితి. ఈ పండుగ తర్వాతనే మిగితా పండుగలన్నీ ప్రారంభమవుతాయి. భాద్రపదమాసంలో చతుర్దశినాడు వినాయక చవితి జరుపుకుంటాము. వినాయక చవితినాడు పూజ గదిని అలంకరించుకోవాలి ముందుగా మామిడి ఆకులు కట్టి మందహాసం మీద బియ్యం పోసి ఒక రూపాయ నాణమును పెట్టి దాని మీద గణపతి ప్రతిమను పెట్టాలి. మందహాసం ఇరుప్రక్కల అరటి స్తంభాలు,కలువ పూలు,మొక్క జొన్న బొత్తులు కట్టాలి. మొదట గౌరమ్మ ప్రతిమను పసుపుతో చేసుకోవాలి గౌరీపూజ చేసుకొని ఆ తర్వాత స్వామివారిని 21రకాల పత్రితో,పూలతో పూజించాలి. చదువుకునే పిల్లలు వారి పుస్తకాలను స్వామివారి వద్ద ఉంచడం ఆనవాయితీ. వినాయక వ్రతమును యధావిధిగా ఆచరించి పూజ చేసుకోవాలి.చివరిన శమంతకోపాఖ్యనం విని అక్షింతలు తలపై చల్లుకుంటే చంద్రున్ని చూసినా నీలాపనిందలు రావని మన పూర్వికుల విశ్వాసము.

వినాయక వ్రత విధానం:

ప్రార్థన:
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కంద పూరజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయా దపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గయే తథా
సఙ్గ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే
అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమః ||

సంకల్పం:
ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరత వర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్తి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, దక్షినాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే , చవితితిధౌ, ......వాసర యుక్తాయాం,శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం,శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ఇష్ట కామ్యార్త సిద్ధ్యర్ధం, మనోవాంచ ఫల సిద్ధ్యర్ధం, సమస్థ దురితోపశంత్యర్తం, సమస్థమంగళావాప్త్యర్ధం వర్షే, వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్ధీ ముద్ధిష్య, శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్తం కల్పొక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షొడషొపచార పూజాం కరిష్యే (నీళ్లు తాకవలెను). 
అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్ధం గణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశపూజాం కరిష్యే.


కలశ పూజ:
కలశం గంధ్పుష్పాక్షతైరభ్యర్చ్య (కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షితలద్ది లోపల ఒకపుష్పమునుంచి ఆ పాత్రపై కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రమును చేప్పుకోవాలి ).

కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా|
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య (కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి).

ఇప్పుడు పసుపుతో వినాయకుడిని చేసుకోవాలి.

                                 గణపతి పూజ
ఓం గణాంత్వాం గణపతిం హవామహె కవింకవీనా ముపమశ్రవస్తమం
జ్యేష్ట రాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత్య: ఆనశ్రుణ్వన్నూతిభిసీద సాదనం
మహాగణపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి.
పాదయోః పాద్యం సమర్పయామి
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ముఖే ఆచమనీయం సమర్పయామి
ఔపచారిక స్నానం పరికల్పయామి
వస్త్ర యుగ్మం సమర్పయామి
ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి
గంధం ధారయామి
హరిద్ర కుంకుమ పరిమళద్రవ్యాణి సమర్పయామి
పుష్పైః పూజయామి

ఓం  సుముఖాయ నమః
ఓం  ఏకదంతాయ నమః
ఓం  కపిలాయ నమః
ఓం  గజకర్ణాయ నమః
ఓం లంబోదరాయనమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గణాధిపాయనమః
ఓం ధూమకేతవేనమః
ఓం గణాధ్యక్ష్యాయనమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయనమః
ఓం శూర్పకర్ణాయనమః
ఓం హేరంబాయనమః
ఓం స్కంద పూర్వజాయనమః
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః
ఓం పుష్పైః పూజయామి

నానావిధ పరిమళ పత్ర పుష్పైః పూజయామి , ధూప మాఘ్రాపయామి , సాక్షాద్దీపం దర్షయామి , నైవేద్యం పరికల్పయామి , ఊగీఫలతాంబూలం సమర్పయామి , కర్పూరనీరజనం దర్శయామి, నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి.

నమస్తే దేవదేవేశ నమస్తే గణనాయక
పార్వతీశంకరోత్సంగఖేలనోత్సవలాలన
సమస్త జగదధార వరమూషిక వాహన

ప్రార్ధనాం సమర్పయామి

                                      అథ ప్రాణ ప్రతిష్ఠ:
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః మిహనో ధేహి భోగం జ్యోక్పశ్యేమసూర్య ముచ్చరం తమనుమతే మృళయా నస్వస్తి
స్వామిన్ సర్వజగన్నాధ యావత్పూజావసానకం |
తావత్త్వం  ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురు.
ఆవాహితోభవ, స్థాపితోభవ, సన్నిహితోభవ, సుప్రసన్నోభవ, వరదోభవ
మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిదోభవ 

                                   సిద్ధి వినాయక పూజ:
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాకుశధరందేవం ధ్యాయే త్సిద్ధి వినాయకం
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం
ధ్యాయామి ఆవహయామి
మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్న విరాజితం|
రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం||
ఆసనం సమర్పయామి
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక|
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణద్విరదానన|
పదయోః పాద్యం సమర్పయామి.
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన|
గ్రుహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం|
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ఆనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత|
గ్రుహాణచమనం దేవతుభ్యం దత్తం మయా ప్రభొ
ముఖే ఆచమనీయం సమర్పయామి.
దధ్యాజ్య మధుసంయుక్తం మధుపర్కం మయాహృతం
గ్రుహాణ సర్వలోకేశ గణనాధానమోస్తుతే
మధుపర్కం సమర్పయామి.
పయోదధిఘృతం చైవ శర్కరా మధుసంయుతం
పంచామృతేన స్నపనం క్రియతాంగణనాయక
పంచామృతస్నానం సమర్పయామి.
గంగాది సర్వతీర్ధేభ్యః ఆహృతై రమలైర్జలై:
స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే
శుద్ధొధకేన స్నపయామి
రక్తవస్త్ర ద్వయంచారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రదం గ్రుహాణత్వం లంబోదర హరాత్మజ
వస్త్రయుగ్మం సమర్పయామి.
రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చొత్తరీయకం
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తా భీష్ట ప్రదాయక
యజ్ఞోపవీతం సమర్పయామి
నానావిధాని దివ్యాని నానారత్నోజ్వలానిచ
భూషణాని గృహాణేశ పార్వతీ ప్రియనందన
దివ్యాభరణాని సమర్పయామి
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం
గంధాన్ ధారయామి.
హరిద్రా కుంకుమ పరిమళ ద్రవ్యాణి అక్షతాంశ్చ సమర్పయామి
సుగంధాని సుపుష్పాణి జాతే కుంద ముఖానిచ
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోస్తుతే
పుష్పైః పూజయామి

                                         ఆధాంగ పూజా :
గణేశాయ నమః పాదౌ పూజయామి|
ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి|
శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి|
విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి|
అఖువాహనాయ నమః ఊరూ పూజయామి|
హేరంబాయ నమః కటిం పూజయామి|
లంబొదరాయ నమః ఉదరం పూజయామి|
గణనాధాయ నమః నాభిం పూజయామి|
గణేశాయ నమః హృదయం పూజయామి|
స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి|
స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి|
పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి|
గజవక్త్రాయ నమః వ్క్త్రం పూజయామి|
విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి|
శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి|
ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి|
సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి|
విఘ్నరాజయ నమః సర్వాణ్యంగాని పూజయామి|

21 రకాల పత్రి:
మాచీ పత్రం
గరిక
ఉత్తరేణి ఆకు
గన్నేరు ఆకు
దేవదారు ఆకు
జాజిమల్లి ఆకు
రావి ఆకు
వాకుడు ఆకు
ఉమ్మెత్త ఆకు
తులసీ ఆకు
విష్ణుక్రాంత ఆకు
మరువం ఆకు
దేవకాంచనం ఆకు
తెల్లమద్ది ఆకు
బిల్వం పత్రం
రేగు ఆకు
మామిడి ఆకు
దానిమ్మ ఆకు
వావిలి ఆకు
జమ్మి ఆకు
జిల్లేడు ఆకు




                               అథ ఏకవింశతి పత్ర పూజా :
సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి|
గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి|
ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి|
గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి|
హరసూనవే నమః దత్తూర  పత్రం పూజయామి|
లంబోదరాయ నమః  అపామార్గ పత్రం పూజయామి|
గజకర్ణకాయ నమః తులసీ పత్రం పూజయామి|
ఏకదంతాయ నమః ఆమ్ర పత్రం పూజయామి|
వికటాయ నమః కరవీర  పత్రం పూజయామి|
భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి|
వటవే నమః దాడిమీ  పత్రం పూజయామి|
సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి|
ఫాలచంద్రాయ నమః మరువక  పత్రం పూజయామి|
హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి|
శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి|
సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి|
ఇభవక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి|
వినాయకాయ నమః అశ్వత్ధ పత్రం పూజయామి|
సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి|
కపిలాయనమః అర్క పత్రం పూజయామి|
శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రైః పూజయామి|

                           అష్టోత్తర శతనామవళిః


(ప్రతి నామానికి మొదత 'ఓం' అని, చివర 'నమః' అని చెర్చవలయును)
వినాయకాయ
విఘ్న రాజాయ
గౌరీపుత్రాయ
గణేశ్వరాయ
స్కందాగ్రజాయ
అవ్యయాయ
పూతాయ
దక్షద్యక్షాయ
ద్విజప్రియాయ
అగ్ని గర్వభిదే
ఇంద్ర శ్రీప్రదాయ
వాణీబల ప్రదాయ
సర్వసిద్ధిప్రదాయకాయ
శర్వతనయాయ
శర్వప్రియాయ
సర్వాత్మకాయ
సృష్టికర్తే
దేవానీకార్చితాయ 
 శివాయ
శుద్దాయ
శుద్దిప్రియాయ
శాంతాయ
బ్రహ్మచారిణే
గజాననాయ
ద్వైమాతురాయ
మునిస్తుత్యాయ
భక్త విఘ్నవినాశినే
ఏకదంతాయ
చతుర్భాహవే
శక్తి సంయుతాయ
చతురాయ
లంబోదరాయ
శూర్పకర్ణాయ
హేరంబాయ
బ్రమ్హవిత్తమాయ
కాలాయ
గ్రహపతయే
కామినే
సోమ సూర్యగ్నిలోచనాయ
పాశాంకుశ ధరాయ
చండాయ
గుణాతీతాయ
నిరంజనాయ
అకల్మషాయ
స్వయంసిద్ధాయ
సిద్ధర్చితపదాంబుజాయ
బీజ పూరకాయ
అవ్యక్తాయ
వరదాయ
శాశ్వతాయ
కృతినే
విద్వత్ర్పియాయ
వీతభయాయ
గదినే
చక్రిణే
ఇక్షుచాపదృతే
అబ్జోత్పలకరాయ
శ్రీదాయ
శ్రీపతయే
స్తుతిహర్షితాయ
కులాద్రిబృతే
జటినే
చంద్రచూడాయ
అమరేశ్వరాయ
నాగయజ్ఞోపవీతినే
శ్రీకంఠాయ
వ్రతినే
స్ధూలకంఠాయ
త్రయీకర్త్రే
సామఘోష ప్రియాయ
పురుషోత్తమాయ
స్ధూలతుండాయ
అగ్రగణ్యాయ
గ్రామణ్యే
గణపాయ
స్ధిరాయ
వృద్దిదాయ
సుభగాయ
శూరాయ
వాగీశాయ
సిద్ధిదాయ
దూర్వాబిల్వ ప్రియాయ
కాంతాయ
పాపహారిణే
కృతాగమాయ
సమాహితాయ
వక్రతుండాయ
శ్రీ ప్రదాయ
సౌమ్యాయ
భక్తాకంక్షితదాయ
అచ్యుతాయ
కేవలాయ
సిద్ధాయ
జ్ఞానినే
మాయాయుక్తాయ
కాంతాయ
బ్రహ్మిష్ఠాయ
ప్రమత్త దైత్యభయాయ
వ్యక్తమూర్తయే
అమూర్తకాయ
పార్వతీశంకరోత్సంగ ఖేలనోత్సవలాలనాయ
వరమూషకవాహనాయ
హృష్టస్తుతాయ
ప్రసన్నాత్మనే
సర్వసిద్ధిప్రదాయకాయ
 కేశవాయనమః............. శ్రీ కృష్ణాయనమః వరసిద్ది వినాయక స్వామినే నమః
నానావిధ పరిమళ పత్రపుషైః పూజయామి
దశాంగంగుగ్గులంధూపం సుగంధంచ మనోహరం|
గృహాణసర్వదేవేశ ఉమా పుత్ర నమోస్తుతే||
ధూపమఘ్రాపయామి

సాజ్యంత్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా|
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం||
దీపం దర్శయామి

సుగంధన్ సుకృతంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్|
నైవేద్యం గృహ్యతాం దేవచణమూద్గైః ప్రకల్పితాన్|
భక్ష్యం భోజ్యంచలేహ్యంచ చోష్యం పానీ యమేవచ|
ఇదంగృహాణనైవేద్యం మయాదత్తం వినాయక||
మోదకసహితం మహానైవైద్యం పరికల్పయామి

ఊగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం|
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం||
తాంబూలం సమర్పయామి

ఘృతవర్తి సహస్త్రైశ్చ కర్పూరరశకలై స్తధా|
నీరాజనం మయాదత్తం గౄహాణ వరదో భవ||
నీరజనం దర్శయామి

నమస్తే విఘ్న సంహర్త్రే నమో భక్తేప్సితప్రద|
నమస్తే దేవ దేవేశ నమస్తే గణనాయక|
పార్వతీ శంకరోత్సంగ ఖేలనోత్సవలాలన|
సమస్త జగదాధార వర మూషిక వాహన||
మంత్రపుష్పం సమర్పయామి

విఘ్నేశ్వర విశలాక్ష సర్వాభీష్టఫల ప్రద|
ప్రదక్షిణం కరోమిత్వాం సర్వాన్ కామాన్ ప్రయచ్చమే||
ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి

పునః పూజాం కరిష్యే-చత్రం ధారయామి
చామరాభ్యాం వీజయామి|
నృత్యం దర్శయామి|
గీతం శ్రావయామి|
ఆందోళికా మారోహయామి|
అశ్వారోహణం గజారోహణం వేద పారాయణం శాస్త్ర పారాయణం పురాణ శ్రవణం పంచాంగశ్రవణం పరికల్పయామి|

గనేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతిచ|గణేశశ్తారకో భాభ్యాం గణేశాయ నమో నమః(వాయనము ఇవ్వవలయును)

యస్యస్మృత్యాచ.......తదస్తుమే|| అనేన వరసిద్ది వినాయకవ్రతేన
భగవాన్ వరసిద్ధి వినాయకః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు
ఆచమనము చేయవలయును
                            
                               సిద్ధి వినాయక వ్రత కధ


               బ్రహ్మాడనాయకుదైన భగవంతుని సృష్టిలో ఆర్యావర్తమను పుణ్యభూమి కలదు. ఇందలి నైమిశారణ్యములో అనేక ధర్మ శాస్త్రపురాణేతిహాసవిదుడైన సూత మహర్షి శౌనకాదిమునులకు ధర్మ శాస్త్ర రహస్యములను బోధించుచుండును. ఇట్లుండగా ఒకసారి చంద్రవంశసంజాతుదైన ధర్మనందనుడు జ్ఞాతులవలన రాజ్యము పోగట్టుకొని సోదరులతో కూడి అడవుల పాలై సూతమహర్షిని సందర్శించి తన కష్టములు తీరునట్టి వ్రతమునేదైన ఉపదేశింపుడని కోరెను. అంత సూత మహర్షి ధర్మజా! నీ సంకటములను తీర్చునట్టి వ్రతమొక్కటి కలదు. దీనిని పూర్వము సదా శివుడు కుమారస్వామి కుపదేశించెను. దాని పేరే వినాయక వ్రతము. దీనిని భాద్రపద శుక్లపక్ష చతుర్ధినాడు ఆచరింపవలయును. ఊదయమున స్నానము చేసి శుచిర్బూతుడై నిత్య కృత్యముల ముగించి విఘ్నేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి, గందాక్షత పుష్పదూర్వంకురములతో పూజించి మోదకములు నైవేద్యముగ సమర్పించి కల్పొక్తకము ముగింపవలయును. ఈ వ్రతమునిట్లు ఆచరించిన వారికి సర్వవిఘ్నములు తోలగి ఇష్టార్ధములు నెరవేరును. ధర్మనందనా! ఈ వ్రతమాచరించి దమయంతి నలుని పెండ్లాడెను. శ్రీకృష్ణ పరమాత్మ కూడ ఈ వ్రతాన్ని ఆచరించి శమంతకమణితో బాటు జాంబవతిని పొందగలిగినాడు. అందుచేత ధర్మజా! ఈ వ్రతాన్ని చేసి నీవు కూడ వాంఛితార్ధములు పొందమనెను.

గజాననోత్పత్తి:

              పూర్వము గజరూపముగల రాక్షసుదు శివుని గూర్చి ఘోర తపము చేసెను. పరమశివుడు సంతుష్టుడై వరము కోరుకొనుమనగా, గజాసురుడు స్వామీ ఎల్లప్పుడు నీవు నా ఉదరమునందే నివసింపవలెనని కోరెను. భోళాశంకరుడందుల కంగీకరించెను. ఈశ్వరుడు కనబడక పోగా పార్వతి దుఃఖితయై గజాసురుని గర్భమునందున్నట్లు తెల్లిసికొని విష్ణుమూర్తి నాశ్రయించి తన భర్త నెట్లైన ఇప్పింపుమని కోరెను.అంత విష్ణుమూర్తి నందిని గంగిరెద్దును చేసి దేవతలు వెంటరాగా గజాసురుని సమీపించి చిత్రవిచిత్రములైన గతులతో గంగిరెద్దు నాడించెను.గజాసురుడు సంతోషపడి వరము కోరుకొమ్మనెను. అంతట విష్ణుమూర్తి "ఈ గంగిరెద్దే నందీశ్వరుడు శివదర్శనాన్ని కోరుతున్నడు. శివుని మాకిచ్చివేయు" మని కోరెను. గజాసురుడాశ్చర్యపడి వచినవానిని జగన్నాటక సూత్రధారియైన శ్రీహరిగ గుర్తించి తనకు మరణము తప్పదని తెలుసుకొని మహేశ్వరా నాశిరమును త్రిలోకపూజ్యముగ చేసి, నా చర్మమును నీవు ధరింపుమని కోరుచు వరము నిచ్చెను. నంది గజాసురుని చీల్చి శివదర్శనము చేసెను. ఈ విధముగ విష్ణుమూర్తి పార్వతి వాంఛితమును తీర్చి వైకుంఠమున కరిగెను.

             కైలాసమున పార్వతి తన భర్త రాకను విని సంతోషమోంది అభ్యంగన స్నానమాచరించుచు నలుగుపిండితో నొక బాలుని చేసి ప్రాణమును పోసి సింహ ద్వారమున కాపుంచెను. పరమ శివుడు వచ్చి నంది నారోహించి లోనికి పోబోవ బాలకుడు అడ్డగింపగా శూలమున వాని శిరము త్రుంచి ప్రవేసించెను. తరువాత విషయము తెలిసికొని పశ్చాత్తాప పడుచు గజాసుర శిరము నుంచి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, వానికి విఘ్నాధిపత్యమునిచ్చి గజానన నామమునిడి గణనాయకుని చేసెను. భాద్రపదశుద్దచవితినాడు గజాననునికి విఘ్నాధిపత్యము వచ్చినందున ఆనాడు అందరూ వివిధములైన అపూపములనారగింపచేసి గజాననుని పూజించిరి. గణపతి కడుపునిండ భుజించి తల్లి తండ్రులకు సాష్టంగ నమస్కారము చేయనుద్యమించెసు. ఉదరము నేలకు ఆనుకొనగా, కాళ్లు పైకి లేచి చేతులందక శ్రమపడుచున్న గణపతిని చూచి శివుని శిరముపై నున్న చంద్రుడు వికటముగ నవ్వెను. అంత గణనాయకుదు ఈనాటి చంద్రుని చూచిన వారు నీలాపనిందలకు గురి యయ్యేదరని చంద్రుని శపించెను. వెంటనే చంద్రుడు కళావిహీనుడై శాపమునుపసంహరించి క్షమింపుమని వేడెను. అంత విఘ్నేశ్వరుడు వినాయక వ్రతమును చేసి శ్యమంతక చరితము పఠించినవారికి అపనిందలు తొలగునని చెప్పెను.

శ్యమంతకోపాఖ్యానము:

                   ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మతో నారదుడొకనాడు మాట్లాడుతూ అయ్యా! ఇక సెలవిండు. ఈనాడు వినాయక చతుర్ధి, చంద్రదర్శనము కాక మునుపే నిజాశ్రమము చేరుకొనవలెననెను. అనుమతిస్తూ శ్రీకృష్ణుడు పూర్వవృత్తమును స్మరించి ఆనాటి రాత్రి చంద్రునెవ్వరూ చూడరాదని ద్వారకలో చాటింపించెను. తాను క్షీరప్రియుడగుట చేత శ్రీకృష్ణుడు ఆకాశంవైపు చూడకనే గోష్ఠములోని పాలకుండలో ప్రతిబింబించిన చంద్రబింబాన్ని చూచి ఆహా! నాకేమి అపనిందరానున్నదో అని సందేహపడెను.

                  కొన్నాళ్ళకు సూర్యవంశ శంజాతుడైన సత్రజిత్తు సూర్యారాధన చేసి శ్యమంతకమణిని సంపాదించి కృష్ణదర్శనార్ధమై ద్వారకకు వచ్చెను. అతిధి సత్కారమైన పిదప శ్యమంతకమణిని తనకిమ్మని శ్రీకృష్ణుడడిగెను. అందులకు సత్రాజిత్తు అయ్యా! ఇది దినమునకు ఎనిమిది బారువల బంగారమును ప్రసవించునట్టిది. దీనిని ఎంతటి ఆప్తుని కైనను ఇవ్వననెను. తరువాత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు శ్యమంతకమణిని కంఠమున ధరించి వేటకు వెళ్ళెను. అక్కడ సింహమొకటి మణిని చూచి మాంసఖండమని భ్రమించి అతనిని

చంపి మణిని నోటకరచుకొని పోవుచుండెను. దానిని మార్గమధ్యముననే జాంబవంతుడు సంహరించి ఆ మణిని తన గుహకు తీసికొని పోయి తనకుమార్తె యగు జాంబవతికి ఆటవస్తువుగనిచ్చెను. సత్రాజిత్తు తన తమ్ముని మరణవార్తవిని శ్రీక్రిష్ణుడే ప్రసేనుని వధించి మణినపహరించెనని చాటెను. తనపైబడిన అపవాదమును తొలగించుకొనుటకై శ్రీకృష్ణుడు బయలదేరి అడవిలో ప్రసేనుని కళేబరమును చూచి, దానివెంటనున్న సింహపు కాలిజాడను, భల్లూకచరణ విన్యసమును అనుసరించుచూ జాంబవంతుని గుహజేరి ఉయ్యాలకు కట్టిన శ్యమంతకమణిని చూచెను. దానిని చేతపుచ్చుకొని వెళ్ళబోవుచుండగా జాంబవంతుడు పైబడి శ్రీకృష్ణునితో యుద్ధమునకు తలపడెను. క్రమక్రమముగ తన బలము సన్నగిల్లుటతో వచ్చినవాడు శ్రీరామావతారమేనని గ్రహించికాళ్ళపైబడి క్షమింపుమని వేడెను. జాంబవంతుడు మణితోబాటు జాంబవతిని కూడ శ్రీకృష్ణునకిచ్చెను. కృష్ణుడు ద్వారకకు చేరి జరిగినదంతయూ వివరించి మణిని సత్రజిత్తునకిచ్చెను. సత్రజిత్తు అనవసరముగ కృష్ణునిపై అపనింద మోపినందులకు పశ్చాత్తప్తుడగుచు తనకుమార్తైయైన సత్యభామతో పాటు శ్యమంతకమణిని కూడ శ్రీకృష్ణునకు కానుకగ ఇచ్చెను. కృష్ణుడు సత్యను స్వీకరించి మణిని సత్రజిత్తునకే ఇచ్చివేసి నీలాపనిందను బాపుకొనెను. మఱియు వృత్రాసురుని హతమార్చునపుడు ఇంద్రుడు, సీతాదేవిని వెదుక బూనినపుదు శ్రీరాముడు, అమృతోత్పాదనము చేయునప్పుడు దేవాసురులు, గంగను భూమికి తెచ్చునపుడు భగీరథుడు, వ్యాధినివృత్తి కొఱకై సాంబుడు ఈ వినాయక వ్రతమును చేసి విజయమునొందిరి.

                భాద్రపద శుద్దచతుర్థినాడు ప్రమాదవశమున చంద్రదర్శనమైనచో యథవిధిగ గణపతి నర్చించి శ్యమంతకోపాఖ్యానము చదివి అక్షతలు శిరమున తాల్చినచో నీలాపనింద తొలగి పోవునని శౌనకాదులకు తెల్పి సూతమహర్షి 

No comments:

Post a Comment