Pages

Saturday, June 8, 2013

రాఖీ పౌర్ణమి


రాఖీ పౌర్ణమి 



రక్షాబంధన్ కు భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యం ఉంది. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ. దీనికి సంబంధించి భారతీయ పురాణాల్లో పలు కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
రాక్షస రాజయిన బలిచక్రవర్తి తన భక్తితో శ్రీహరిని తన ఇంట్లో బంధిస్తాడు. అప్పుడు మహాలక్ష్మి ఓ సామాన్య స్త్రీగా మారి బలిచక్రవర్తి ఇంటికి వచ్చి అతనిని సోదరునిగా భావించి చేతికి రక్షాబంధన్‌ను కడుతుంది. దీంతో ఏమి బహుమతి కావాలో కోరుకోమని చక్రవర్తి అడుడుతాడు. వెంటనే మహాలక్ష్మి తన నిజస్వరూపంలోకి వచ్చి తన స్వామిని విడిచి పెట్టాలని కోరుతుంది. దీంతో శ్రీహరిని విడిచిపెడతాడు.
అలాగే శ్రీకృష్ణుడికి మణికట్టు వద్ద దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ద్రౌపది తన చీర చించి కట్టుకడుతుంది. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని చీరలాగుతుండగా శ్రీకృష్ణుడు చీరను ఇచ్చి ఆమె గౌరవాన్ని కాపాడు తాడు.
కర్ణావతి అనే మహిళ చిత్తోర్‌గడ్‌ రాణిగా ఉండేవారు. భర్త అకాల మరణంతో రాజ్యభారం ఆమె మీద పడుతుంది. దీంతో ఇది సరైన సమయంగా భావించిన గుజరాత్‌ సుల్తాన్‌ బహుదూర్‌ షా చిత్తోర్‌ గడ్‌పై తన సేనలతో దండెత్తుతాడు. అతనిని ఎదుర్కొనేందుకు ఏమి చేయాలో పాలుపోని కర్ణావతి సాయం చేయాలని కోరుతూ మొఘల్‌ చక్రవర్తి హుమాయూన్‌కు ఒక రాఖీని పంపుతుంది. ఈ రాఖీతో కర్ణావతిని తన సోదరిగా భావించిన చక్రవర్తి ఆమెకు అండగా నిలువడమే కాకుండా బహుదూర్‌షాను యుద్ధంతో ఓడిస్తాడు. ఈ చారిత్రక ఘటనకు సాక్ష్యం ఈ రాఖీ. అప్పటి నుండి ఈ పండుగను ఉత్తర భారతీయులు జరుపుకుంటూ వస్తున్నట్టు ఇంకో కథనం ఉంది.

///////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////

అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలకు శుభసూచకంగా జరుపుకునే పండుగను 'రాఖీ' లేదా 'రక్షాబంధన్'‌ అంటారు. దీనికి 'రాఖీ పౌర్ణమి' అనే మరో పేరు కూడా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. కొంతకాలం క్రితం వరకు ఉత్తర, పశ్చిమ భారతదేశంలో మాత్రమే ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా విస్తరించింది. 

అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ముఖ్యోద్ధేశం. అంతేకాకుండా.. జీవితాంతం తమకు రక్షణ కల్పించమని దీని ప్రధానాంశం. దీన్ని ఏడాదికో మారు గుర్తుచేసేందుకే అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళు రాఖీ కడుతారు. నాటి ఉమ్మడి కుటుంబాల్లో రక్షాబంధన్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉండేది. ఇది ప్రస్తుతం చిన్న కుటుంబాల్లో విస్తరించడంతో మరింత ఆదరణ పెరిగింది. 

చరిత్ర పుటలను ఒకసారి తిరగేస్తే.. సోదర భావంతో పంపిన రాఖీలు యుద్ధాలను ఆపాయి. రక్తపాతాన్ని నివారించాయి. రాజ్యాలు కూలిపోకుండా చేశాయి. సరికొత్త అనుబంధాలను సృష్టించాయి. దీనికి ఈ ఉదాహరణే మచ్చుతునక. కర్ణావతి అనే ధీరవనిత చిత్తోర్‌గఢ్ రాణిగా ఉండేవారు. భర్త అకాల మరణంతో రాజ్యభారాన్ని ఆమె మోయాల్సి వచ్చింది.
పొడి పొడి ఆప్యాయతల రక్షా రేకు
  రక్షాబంధన్ పవిత్రత కాలంతోపాటు మారిపోయింది. మారుతున్న ట్రెండ్‌‌కు అనుగుణంగా జరుపుకోవడం ఆరంభమైంది. 'ప్రేమా... గీమా' అంటూ వెంటపడేవారిని వదిలించుకోవడానికి 'అన్నా' అంటూ బహుమతులను ఒడిసి పట్టేందుకూ పొడి పొడి అప్యాయతలు రాఖీలతో వ్యక్తపరచడం వాడుకగా మారింది      


ఇదే సరైన సమయంగా భావించిన గుజరాత్ సుల్తాన్ బహుదూర్ షా చిత్తోర్‌గఢ్‌పై తన సేనలతో దండెత్తాడు. ఏమి చేయాలో పాలుపోని కర్ణావతి.. సాయం కోరుతూ మొఘల్ చక్రవర్తి హుమయూన్‌‌కు ఒక రాఖీని పంపుతుంది. 

ఈ రాఖీతో కర్ణావతిని సోదరిగా భావించిన మొఘల్ చక్రవర్తి కర్ణావతికి అండగా నిలువడమే కాకుండా.. బహుదూర్‌ షాను యుద్ధంలో ఓడిస్తాడు. ఈ చారిత్రక ఘటనకు సజీవ సాక్ష్యం ఈ రాఖీ. అప్పటి నుంచి రాఖీ పండుగను ఉత్తర భారతీయులు జరుపుకుంటూ వస్తున్నట్టు ఒక వాదన కూడా వుంది. ఇలాంటి మరుపురాని మధుర స్మృతులెన్నో చరిత్రలో దాగివున్నాయి. 

అలా.. ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ రక్షాబంధన్ పవిత్రత కాలంతోపాటు మారిపోయింది. మారుతున్న ట్రెండ్‌‌కు అనుగుణంగా జరుపుకోవడం ఆరంభమైంది. 'ప్రేమా... గీమా' అంటూ వెంటపడేవారిని వదిలించుకోవడానికి 'అన్నా' అంటూ బహుమతులను ఒడిసి పట్టేందుకూ పొడి పొడి అప్యాయతలు రాఖీలతో వ్యక్తపరచడం వాడుకగా మారింది. హృదయ పొరల్లో ఆర్థ్రత లోపించడం... ఓ సంప్రదాయంగా మాత్రమే రక్షాబంధన్‌ మిగిలిపోవడం విచారకరం.


....................................................................................................................................................................................................

No comments:

Post a Comment