Pages

Saturday, June 8, 2013


శ్రీ హనుమజ్జయంతి


యత్ర యత్ర రఘునాధ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలీం|
బాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం||

             శ్రీ అంజనేయ స్వామి వారి భక్తులకు ఇది ముఖ్యమైన పర్వదినము. వైశఖబహుళదశమి నాడు మనము హనుమజ్జయంతి జరుపుకుంటాము. భక్తతులసిదాస్ కు సాక్షాత్కారం ఇచ్చి ఇప్పటికిని హిమాలయాలలో చిరంజీవిగా తపస్సు చేసుకొనుచున్నాడు. ' రామాయణంలోని అంజనేయుడు జీవించి వుంటాడా? ' అని ఆశ్చర్యపోనక్కరలేదు. ఆయన చిరంజీవి  అతులిత బలధాముడు మహాయోగి.

పూజా విధానం :
హనుమంతుని పటం పూజా మందిరంలో పెట్టి షొడశోపచారములతొ పూజ చేయాలి. స్వామి వారికి మనకు తోచిన నైవెద్యం పెట్టి హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణ చేయాలి. అలా చేసిన అన్ని రంగాలలోను ఎనలేని విజయం చేకూరుతుంది.

No comments:

Post a Comment